మీ బ్లాగ్ సెట్టింగ్‌లను నిర్వహించండి

మీరు వెబ్‌లో Bloggerని ఉపయోగించినప్పుడు మీ బ్లాగ్ సెట్టింగ్‌లను నిర్వహించవచ్చు. కింది కంటెంట్ వివిధ రకాల బ్లాగ్ సెట్టింగ్‌ల గురించి, మీరు మీ బ్లాగ్‌ని ఎలా అనుకూలీకరించాలి అనే వాటి గురించి సమాచారం అందిస్తుంది.

ప్రాథమికం

టైటిల్

మీ బ్లాగ్ టైటిల్.

వివరణ

మీ బ్లాగ్ వివరణ.

బ్లాగ్ భాష

మీ బ్లాగ్ యొక్క భాష.

పెద్దలు మాత్రమే చూడగలిగే కంటెంట్

ఈ సెట్టింగ్ అన్నది మీ బ్లాగ్ కంటెంట్‌లో పెద్దలు మాత్రమే చూడగలిగే కంటెంట్, అలాగే నగ్నత్వం లేదా లైంగిక కార్యకలాపం ప్రదర్శించే ఇమేజ్‌లు లేదా వీడియోలు ఉన్నట్లుగా సూచిస్తుంది. అని ఎంచుకున్నట్లయితే, మీ బ్లాగ్ వీక్షకులు మీ బ్లాగ్‌ను చూడటాన్ని కొనసాగిస్తారా లేదా అని నిర్ధారించడానికి ప్రాంప్ట్ చేస్తూ, ఒక హెచ్చరిక సందేశాన్ని చూస్తారు.

Google Analytics ప్రాపర్టీ ID

సందర్శకులు మీ సైట్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నది చూడటానికి Google Analyticsని మీ బ్లాగ్‌కి జోడించండి. మీ బ్లాగ్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించడానికి మీ Google Analytics వెబ్ ప్రాపర్టీ IDని (ఉదాహరణకు, <code;ua-123456-1< code="">) యాడ్ చేయండి. ఈ సెట్టింగ్ అన్నది డైనమిక్ వీక్షణలు, లేఅవుట్ థీమ్‌లకు ప్రత్యేకమైనది. మీ బ్లాగ్ కోసం క్లాసిక్ థీమ్‌ను ఉపయోగిస్తుంటే, దానిని మాన్యువల్‌గా మీ రెగ్యులర్ థీమ్‌కి యాడ్ చేయాల్సి ఉంటుంది.</code;ua-123456-1<>

ఫెవీకాన్

అనుకూలమైన ఫెవీకాన్‌ని అప్‌లోడ్ చేయండి.

గోప్యత

Bloggerలో జాబితా చేయబడింది

Blogger.com లేదా ఇతర బ్లాగ్‌ల నుండి మీ బ్లాగ్‌కు లింక్ చేయడానికి వ్యక్తులను అనుమతించండి.

సెర్చ్ ఇంజిన్‌లకు కనిపిస్తుంది

మీ బ్లాగ్‌ను కనుగొనడానికి సెర్చ్ ఇంజిన్‌లను అనుమతించండి.

పబ్లిష్ చేయడం

బ్లాగ్ అడ్రస్

బ్లాగ్ అడ్రస్ లేదా URLని ఎంచుకోండి.

ముఖ్య విషయం: ఎంచుకున్న ఉపడొమైన్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.

అనుకూల డొమైన్

రిజిస్టర్ చేసిన మీ స్వంత URLను మీ బ్లాగ్‌కు సూచించండి. అసంపూర్ణ డొమైన్‌లలో (ఉదాహరణకు: yourdomain.com) బ్లాగ్‌లను హోస్ట్ చేయడం అనుమతించబడదు, అయినప్పటికీ అగ్ర-స్థాయి డొమైన్‌ని (www.yourdomain.com) లేదా ఉపడొమైన్‌ని (blog.yourdomain.com) తప్పనిసరిగా జోడించాలి. మొదట మీ డొమైన్ సరిగ్గా రిజిస్టర్ అయి ఉండాలి.

  • మళ్లించే డొమైన్
    ఈ ఆప్షన్ ద్వారా "అసంపూర్ణం" డొమైన్ నుండి అనుకూల డొమైన్‌కి ఒక మళ్లింపును అనుమతిస్తుంది (ఉదాహరణకు, "example.com" నుండి "www.example.com"కి దారి మళ్లించడానికి).
  • ఫాల్‌బ్యాక్ ఉప డొమైన్
    మీ అనుకూల డొమైన్‌ని మీ బ్లాగ్‌తో అనుబంధించడానికి CNAMEని ఉపయోగించవచ్చు. CNAMEని క్రియేట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

HTTPS

HTTPS లభ్యత

ఈ సెట్టింగ్ కేవలం Blogspot అడ్రస్‌లు ఎల్లవేళలా HTTPS కలిగి ఉండే అనుకూల డొమైన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ HTTPS మళ్లింపు ఆన్ చేసి ఉంటే:

  • మీ బ్లాగ్ సందర్శకులు ఎల్లవేళలా https://<your-blog>.blogspot.comకి వెళ్తారు.

ఒకవేళ HTTPS మళ్లింపు ఆఫ్ చేసి ఉంటే:

HTTPS మళ్లింపు

మీరు HTTPS మళ్లింపును ఆన్ చేసినప్పుడు, సందర్శకులు ఎల్లవేళలా https://<your-blog>.blogspot.comలోని సురక్షిత వెర్షన్‌కు వెళ్తారు.

అనుమతులు

బ్లాగ్ అడ్మిన్‌లు, రచయితలు

బ్లాగ్ అడ్మిన్‌లు, రచయితల జాబితాను ప్రదర్శిస్తుంది. వారి మెంబర్‌షిప్‌ని కూడా మీరు ఇక్కడ మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

పెండింగ్‌లో ఉన్న రచయితల ఆహ్వానాలు

రచయిత కావడానికి మీరు పంపిన ఆహ్వానం ఇంకా ఆమోదించని యూజర్‌లను చూపుతుంది.

మరింత మంది రచయితలను ఆహ్వానించండి

బ్లాగ్ రచయితని యాడ్ చేయడానికి, మీరు యాడ్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఇమెయిల్ అడ్రస్‌ని ఎంటర్ చేయండి. వారు ఆహ్వానం ఆమోదించిన తర్వాత, వారు రచయితగా జాబితా చేయబడతారు. మీరు గరిష్ఠంగా 100 మంది మొత్తం మెంబర్‌లను (రచయితలు, అడ్మినిస్ట్రేటర్‌లు లేదా పాఠకులు) మీ బ్లాగ్‌కు యాడ్ చేయవచ్చు.
ముఖ్య విషయం: బ్లాగ్‌లను నిర్వహించడానికి, వాటిలో పోస్ట్‌లు చేయడానికి Google ఖాతా అవసరం.

రీడర్ యాక్సెస్

ఆటోమేటిక్‌గా, మీ బ్లాగ్ పబ్లిక్‌గా ఉంటుంది. దానిని ఆన్‌లైన్‌లో ఎవరైనా చదవగలరు. మీ బ్లాగ్‌ను ఎవరెవరు చూడవచ్చనే దానిపై పరిమితి విధించడానికి, “రీడర్ యాక్సెస్” విభాగంలో, పబ్లిక్, రచయితలకు ప్రైవేట్ లేదా అనుకూల రీడర్‌లు ఎంపికలను ఎంచుకోండి.

అనుకూల రీడర్‌లు

బ్లాగ్ రీడర్‌ల జాబితాను ప్రదర్శిస్తుంది.

పెండింగ్‌లో ఉన్న అనుకూల రీడర్ ఆహ్వానాలు

రీడర్ కావడానికి మీ ఆహ్వానం ఇంకా అంగీకరించని యూజర్‌లను చూపుతుంది.

మరింత మంది రీడర్‌లను ఆహ్వానించండి

మీ బ్లాగ్‌ను చదవాలని మీరు కోరుకునే వ్యక్తి ఇమెయిల్ అడ్రస్‌ని ఎంటర్ చేయండి.

పోస్ట్‌లు

ప్రధాన పేజీలో చూపించే గరిష్ఠ పోస్ట్‌ల సంఖ్య

మీరు ప్రధాన పేజీలో ఎన్ని పోస్ట్‌లు గరిష్ఠంగా చూపాలనుకుంటున్నారో ఎంచుకోండి.

పోస్ట్ టెంప్లేట్ (తప్పనిసరి కాదు)

మీరు ప్రతిసారి కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసేటప్పుడు కనిపించవలసిన టెక్స్ట్ లేదా కోడ్‌తో పోస్ట్ టెంప్లేట్‌లు పోస్ట్ ఎడిటర్‌ను ఫార్మాట్ చేస్తాయి. పోస్ట్ టెంప్లేట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

ఇమేజ్ లైట్‌బాక్స్

ఎంచుకున్నప్పుడు, మీ ఇమేజ్‌లు ఒక క్లిక్‌పై మీ బ్లాగ్ పైభాగంలోని ఓవర్లేలో కనిపిస్తాయి. మీ పోస్ట్‌లో అనేక ఇమేజ్‌లు ఉంటే, అవి స్క్రీన్ దిగువ భాగంలో థంబ్‌నెయిల్స్‌గా కనిపిస్తాయి.

కామెంట్‌లు

కామెంట్ లొకేషన్

  • పొందుపరిచినవి: పోస్ట్‌కు రిప్లయి ఇవ్వడానికి యూజర్‌లు అనుమతించబడతారు.
  • పూర్తి పేజీ, పాప్అప్ విండో: యూజర్‌లు వారి కామెంట్ చేయడానికి కొత్త పేజీకి తీసుకెళ్తుంది.

ముఖ్య విషయం: మీరు "దాచిపెట్టు" ఎంచుకున్నప్పుడు, ఇప్పటికే ఉన్న కామెంట్‌లు తొలగించబడవు. మీరు మరొక ఎంపికను ఎంచుకోవడం ద్వారా వాటిని ఎప్పుడైనా చూపవచ్చు.

ఎవరు కామెంట్ చేయవచ్చు?

Bloggerలోని మీ బ్లాగ్ పోస్ట్‌లపై ఎవరు కామెంట్ చేయవచ్చన్నది మీరు నిర్వహించవచ్చు. "ఎవరు కామెంట్ చేయవచ్చు" విభాగంలో, వీరిని ఎంచుకోండి:

  • ఎవరైనా (అజ్ఞాత వ్యక్తులతో సహా)
  • Google ఖాతాలు ఉన్న యూజర్‌లు
  • ఈ బ్లాగ్ మెంబర్‌లు మాత్రమే

కామెంట్‌ల నియంత్రణ

కామెంట్‌లు పబ్లిష్ చేసే ముందు రివ్యూ చేయండి. కామెంట్‌లను రివ్యూ చేయడానికి కామెంట్‌ల వీక్షణకు వెళ్లండి. కామెంట్‌ల నియంత్రణ గురించి మరింత తెలుసుకోండి.

  • నిర్ణీత రోజుల కంటే పాత పోస్ట్‌లు
    మీరు కామెంట్‌ల నియంత్రణ విభాగంలో "కొన్నిసార్లు" ఎంచుకుని ఉంటే, ఆ సమయ పరిధిలోని కామెంట్‌లు మాత్రమే నియంత్రణ విభాగానికి పంపబడతాయి.
  • వీటికి ఇమెయిల్ నియంత్రణ రిక్వెస్ట్‌లు
    మీరు మీ బ్లాగ్‌లో కొత్త కామెంట్‌ను పొందినప్పుడు ఇమెయిల్ అలర్ట్ అందుకుంటారు.​

రీడర్ కామెంట్ కాప్చా

ఎవరైనా మీ బ్లాగ్‌లో కామెంట్ చేయాలనుకుంటే, వారు పద ధృవీకరణ దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. కోరుకోని కామెంట్‌లు ఎలా నిరోధించాలో తెలుసుకోండి. బ్లాగ్ రచయితలకు కామెంట్‌ల కోసం పద ధృవీకరణ కనిపించదు.

ముఖ్య విషయం: ఈ సెట్టింగ్‌ని ఆఫ్ చేసినా కూడా పోస్ట్ చేసే ముందు కోడ్‌ని ఎంటర్ చేయాల్సిందిగా కొందరు కామెంటర్‌లను కోరవచ్చు.

కామెంట్‌ ఫారమ్ మెసేజ్

కామెంట్ బాక్స్ దిగువున ఈ మెసేజ్ ప్రదర్శితమవుతుంది.

ఇమెయిల్

ఇమెయిల్ ఉపయోగించి పోస్ట్ చేయండి

ఇమెయిల్‌ని Mail2Blogger అని కూడా అంటారు. టెక్స్ట్, ఇమేజ్‌లను నేరుగా మీ బ్లాగ్‌కు పోస్ట్ చేయడానికి ఈ అడ్రస్‌ని ఉపయోగించండి.

కామెంట్ నోటిఫికేషన్ ఇమెయిల్

ఎవరైనా మీ బ్లాగ్‌లో కామెంట్ చేసినప్పుడు మేము ఈ అడ్రస్‌లకు తెలియజేస్తాము.

పెండింగ్‌లో ఉన్న కామెంట్ నోటిఫికేషన్ ఇమెయిల్‌లు

కామెంట్ నోటిఫికేషన్ ఇమెయిల్‌లు పొందడానికి మీ ఆహ్వానాన్ని ఇంకా ఆమోదించని యూజర్‌లకు చూపుతుంది.

కామెంట్ నోటిఫికేషన్ ఇమెయిల్‌లకు మరింత మంది వ్యక్తులను ఆహ్వానించండి

మీరు గరిష్టంగా 10 ఇమెయిల్ అడ్రస్‌లను, కామాలతో వేరు చేసి ఎంటర్ చేయవచ్చు.

పోస్ట్‌లను దీనికి ఇమెయిల్ చేయండి

మీరు కొత్త పోస్ట్‌ను పబ్లిష్ చేసినప్పుడల్లా ఈ అడ్రస్‌లకు ఇమెయిల్ పంపబడుతుంది.

పెండింగ్‌లో ఉన్న పోస్ట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇమెయిల్‌లు

పోస్ట్ నోటిఫికేషన్ ఇమెయిల్‌లు పొందడానికి మీ ఆహ్వానాన్ని ఇంకా ఆమోదించని యూజర్‌లకు చూపుతుంది.

నోటిఫికేషన్‌లను పోస్ట్ చేయడానికి మరింత మంది వ్యక్తులను ఆహ్వానించండి

మీరు గరిష్ఠంగా 10 ఇమెయిల్ అడ్రస్‌లను కామాతో వేరు చేసి, ఎంటర్ చేయవచ్చు.

ఫార్మాటింగ్‌

టైమ్ జోన్

మీ టైమ్ జోన్‌ని సెట్ చేయండి.

తేదీ హెడర్ ఫార్మాట్

మీ పోస్ట్‌ల పైన తేదీ ఇలా కనిపిస్తుంది.

టైమ్ స్టాంప్ ఫార్మాట్

పోస్ట్ టైమ్ స్టాంప్ ఈ విధంగా కనిపిస్తుంది.

కామెంట్ టైమ్ స్టాంప్ ఫార్మాట్

కామెంట్ టైమ్ స్టాంప్ ఈ విధంగా కనిపిస్తుంది.

మెటా ట్యాగ్‌లు

సెర్చ్ వివరణను ఎనేబుల్ చేయండి

బ్లాగ్ సెర్చ్ వివరణను సెట్ చేయండి. మీ బ్లాగ్ అంతా దేని గురించి అన్నది సారాంశం వ్రాయడం ద్వారా సెర్చ్ ఫలితాలలో మీ బ్లాగ్‌ని ఎంచుకోవడంలో యూజర్‌లకు సహాయపడండి. బ్లాగ్ వివరణల గురించి మరింత తెలుసుకోండి.

ఎర్రర్‌లు, మళ్లింపులు

అనుకూలం 404

బ్లాగ్ 404 పేజీ కనుగొనబడలేదు మెసేజ్‌ని సెట్ చేయండి. 404 పేజీలో సాధారణ మెసేజ్‌కి బదులుగా చూపించాల్సిన మెసేజ్‌ని ఎంటర్ చేయండి.

అనుకూల మళ్లింపులు

బ్లాగ్ అనుకూల మళ్లింపులను సెట్ చేయండి. మీ బ్లాగ్‌లోని పేజీలకు పాయింట్ చేసే URLల కోసం అనుకూల మళ్లింపులు యాడ్ చేయండి.

  • వీరి నుండి
    తొలగించిన URLని యాడ్ చేయండి. ఒకవేళ అసలైన కథనం తొలగించి ఉంటే, శాశ్వతం ఎంచుకోండి.
  • వీరికి
    మీరు సూచించాలనుకుంటున్న URLని యాడ్ చేయండి.

Clawlerలు, ఇండెక్స్ చేయడం

అనుకూల robots.txtని ఎనేబుల్ చేయండి

మీ బ్లాగ్ అనుకూల robots.txt కంటెంట్‌ని సెట్ చేయండి. సెర్చ్ ఇంజిన్‌లకు డిఫాల్ట్ robots.txt బదులుగా ఈ టెక్స్ట్ వినియోగించబడుతుంది. robots.txt కంటెంట్ గురించి మరింత తెలుసుకోండి.

అనుకూల రోబోట్‌ల హెడర్ ట్యాగ్‌లను ఎనేబుల్ చేయండి

బ్లాగ్ యొక్క అనుకూల రోబోట్‌ల శీర్షిక ట్యాగ్‌లను సెట్ చేయండి. ఈ ఫ్లాగ్‌లు సెర్చ్ ఇంజిన్‌లకు అందించిన రోబోట్‌ల టైటిల్ ట్యాగ్‌లను సెట్ చేయడానికి ఉపయోగించబడతాయి. రోబోట్ హెడర్ ట్యాగ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

Google Search Console

Search Consoleకి లింక్ చేయండి.

మానిటైజేషన్

అనుకూల ads.txtని ఎనేబుల్ చేయండి

బ్లాగ్ యొక్క అనుకూల ads.txt కంటెంట్‌ను సెట్ చేయండి. మీరు ads.txt ఫైల్ సహాయంతో మీ డిజిటల్ యాడ్‌ల స్పేస్ పునఃవిక్రేతలను ప్రత్యేకంగా గుర్తించగలుగుతారు, వారికి అధికారం మంజూరు చేయగలుగుతారు. అనుకూల యాడ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

బ్లాగ్‌ని నిర్వహించండి

కంటెంట్‌ను దిగుమతి చేయండి

మీరు మీ పోస్ట్‌లు, కామెంట్‌ల .xml ఫైల్‌లను మీ బ్లాగ్‌కి దిగుమతి చేయవచ్చు.

కంటెంట్‌ను బ్యాకప్ చేయండి

మీరు బ్లాగ్‌ను బ్యాకప్ చేసినప్పుడు పోస్ట్‌లు, కామెంట్‌ల .xml ఫైల్‌ని పొందుతారు.

మీ బ్లాగ్‌లోని వీడియోలు

మీరు మీ బ్లాగ్ నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.

మీ బ్లాగ్‌ను తీసివేయండి

మీరు ఒక బ్లాగ్‌ను తొలగించినప్పుడు దానిని రీస్టోర్ చేసుకోవడానికి మీకు నిర్ణీత స్వల్ప సమయం ఉంటుంది. మీరు ఒక బ్లాగ్‌ని శాశ్వతంగా తొలగించినప్పుడు మీ మొత్తం బ్లాగ్ సమాచారం, పోస్ట్‌లు, పేజీలు తొలగించబడతాయి. మీరు వాటిని రీస్టోర్ చేయలేరు.

ముఖ్య విషయం: తొలగించిన బ్లాగ్‌లను శాశ్వతంగా తీసివేయడానికి ముందు 90 రోజులలోపు రీస్టోర్ చేయవచ్చు. మీరు ప్రస్తుతం లాగిన్ అయిన Google ఖాతాను ఉపయోగించి ఈ అడ్రస్‌లో మీరు మరొక బ్లాగ్‌ను క్రియేట్ చేయవచ్చు. మీరు మీ బ్లాగ్‌ను తొలగించే ముందు, దానిని ఎగుమతి చేయవచ్చు.

సైట్ ఫీడ్

బ్లాగ్ ఫీడ్‌ని అనుమతించండి

  • పూర్తిగా: మీ పోస్ట్‌లోని మొత్తం కంటెంట్‌లను పంపిణీ చేస్తుంది.
  • దాటవేసే విభజన వరకు: మీ దాటవేసే విభజనకు ముందు మొత్తం పోస్ట్ కంటెంట్‌ను చూపుతుంది. దాటవేసే విభజనల గురించి మరింత తెలుసుకోండి.
  • స్వల్పం: సుమారుగా మొదటి 400 అక్షరాలు పంపిణీ చేస్తుంది.
  • ఏదీ వద్దు: మీరు "ఏదీ వద్దు" ఎంచుకుంటే, మీ బ్లాగ్ XML ఫీడ్ డిజేబుల్ చేయబడుతుంది.
  • అనుకూలం: బ్లాగ్ పోస్ట్‌లు, కామెంట్ ఫీడ్ లేదా ఒక్కో పోస్ట్ యొక్క కామెంట్ ఫీడ్ కోసం అధునాతన ఆప్షన్‌లు సెట్ చేయండి.
    • బ్లాగ్ పోస్ట్ ఫీడ్
      మీ పోస్ట్ కంటెంట్‌లో ఎంత భాగాన్ని మీరు షేర్ చేయాలనుకుంటున్నది ఎంచుకోండి.
    • బ్లాగ్ కామెంట్ ఫీడ్
      మీ కామెంట్ కంటెంట్‌లో ఎంత భాగాన్ని మీరు షేర్ చేయాలనుకుంటున్నది ఎంచుకోండి.
    • ఒక్కో పోస్ట్‌కు కామెంట్ ఫీడ్‌లు
      మీ ఒక్కో పోస్ట్ కామెంట్‌ల కంటెంట్‌లో ఎంత భాగాన్ని మీరు షేర్ చేయాలనుకుంటున్నది ఎంచుకోండి.

పోస్ట్ ఫీడ్ మళ్లింపు URL

మీరు FeedBurnerతో మీ పోస్ట్ ఫీడ్‌ను బర్న్ చేసి ఉంటే లేదా మీ ఫీడ్‌ను ప్రాసెస్ చేయడానికి మరొక సర్వీస్‌ని ఉపయోగించి ఉంటే, పూర్తి ఫీడ్ URLను ఇక్కడ ఎంటర్ చేయండి. Blogger మొత్తం పోస్ట్ ఫీడ్ ట్రాఫిక్‌ను ఈ అడ్రస్‌కి మళ్లిస్తుంది. ఒకవేళ మళ్లింపు వద్దు అనుకుంటే దీన్ని ఖాళీగా వదిలేయండి.

పోస్ట్ ఫీడ్ ఫుటర్

మీ పోస్ట్ ఫీడ్‌లో ప్రతి పోస్ట్ తర్వాత ఇది కనిపిస్తుంది. మీరు యాడ్‌లను లేదా ఇతర థర్డ్-పార్టీ ఫీడ్ అదనాలను ఉపయోగిస్తే, మీరు ఆ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. అలాగే మీరు “బ్లాగ్ ఫీడ్ అనుమతి” ఎంపికను పూర్తిగా అని సెట్ చేయండి.

టైటిల్, ఎన్‌క్లోజర్ లింక్‌లు

ఇది టైటిల్ లింక్, ఎన్‌క్లోజర్ లింక్ ఆప్షన్‌లను పోస్ట్ ఎడిటర్‌లో యాడ్ చేస్తుంది.

  • టైటిల్ లింక్‌లు సహాయంతో మీరు మీ పోస్ట్ టైటిల్ కోసం అనుకూల URLని సెట్ చేసుకోగలరు.
  • ఎన్‌క్లోజర్ లింక్‌లు అనేవి మీ పోస్ట్‌లలోని పాడ్‌కాస్ట్‌లు, MP3లు, ఇతర కంటెంట్‌ను RSS, Atom లాంటి ఫీడ్‌లలో ప్లే చేయడానికి ఉపయోగించబడతాయి.

సాధారణం

Blogger డ్రాఫ్ట్‌ని ఉపయోగించండి

Blogger డ్రాఫ్ట్ అంటే బీటా వెర్షన్‌లోని Blogger. కొత్త ఫీచర్‌లను అందరు Blogger యూజర్‌లకు రిలీజ్ చేయడానికి ముందే పరీక్షించడానికి దానిని ఎనేబుల్ చేయండి.

యూజర్ ప్రొఫైల్

మీ యూజర్ ప్రొఫైల్‌ను మేనేజ్ చేయడానికి, "యూజర్ ప్రొఫైల్" లింక్‌ను క్లిక్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12132587178135224618
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false