Androidలో Blogger మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించండి

మీ బ్లాగ్ పోస్ట్‌లను పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, సేవ్ చేయడానికి, చూడటానికి Blogger మొబైల్ అప్లికేషన్ మీకు అవకాశం కల్పిస్తుంది. Android 5.0, మరియు దానికి తర్వాతిది ఉన్న ఎవరైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ముఖ్య గమనిక: Blogger మొబైల్ అప్లికేషన్‌తో పోస్ట్ చేయడానికి, మీరు ఇప్పటికే Google ఖాతా, కంప్యూటర్‌లో క్రియేట్ చేసిన బ్లాగ్‌ను కలిగి ఉండాలి.

మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా యాప్‌తో పోస్ట్‌లను పబ్లిష్ చేయవచ్చు. మీరు మీ పోస్ట్‌ను డ్రాఫ్ట్‌గా సేవ్ చేయవచ్చు, తరువాత కంప్యూటర్‌లో ఎడిట్ చేయవచ్చు లేదా మీ కంప్యూటర్‌లోని యాప్ నుండి మీ డ్రాఫ్ట్‌ను ఎడిట్ చేయవచ్చు. సెట్టింగ్‌లు, లేఅవుట్‌లను మార్చడానికి లేదా మీ గణాంకాలను చెక్ చేయడానికి, మీరు వెబ్‌లో Blogger డాష్‌బోర్డ్‌ను ఉపయోగించవచ్చు. 

మీరు యాప్‌లో చేయగలిగినవి

మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు పబ్లిష్ చేసిన, డ్రాఫ్ట్ చేసిన పోస్ట్‌లను బ్రౌజ్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు. బహుళ బ్లాగ్‌లకు అడ్మిన్ లేదా రచయిత అనుమతులు మీ వద్ద ఉంటే, మీరు ఒక బ్లాగ్ నుండి మరొక బ్లాగ్‌కు మారవచ్చు. 

మొబైల్ అప్లికేషన్‌తో మీరు వీటిని చేయవచ్చు:

  • కొత్త పోస్ట్‌లను క్రియేట్ చేసి, పబ్లిష్ చేయవచ్చు
  • తర్వాత పూర్తి చేసేలా పోస్ట్‌లను డ్రాఫ్ట్‌గా సేవ్ చేయవచ్చు
  • 'Android షేర్' ఉపయోగించి మీ పోస్ట్‌కు లింక్‌ను షేర్ చేయవచ్చు
  • బ్రౌజర్‌లో బ్లాగ్ లేదా పోస్ట్‌ను తెరవవచ్చు
  • ఖాతాలు, బ్లాగ్‌ల మధ్య స్విచ్ కావచ్చు
  • Blogger సహాయ కేంద్రంను సందర్శించవచ్చు 
  • యాప్‌లో ఫీడ్‌బ్యాక్ పంపవచ్చు

మీ పోస్ట్‌లను క్రియేట్, ఎడిట్, పబ్లిష్ చేయడం

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Blogger యాప్‌Bloggerను తెరవండి.
  2. అడిగితే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. దిగువున కుడివైపు, పోస్ట్‌ను క్రియేట్ చేయి Edit ట్యాప్ చేయండి.
  4. శీర్షికను ఎంటర్ చేసి, మీ పోస్ట్ బాడీని డ్రాఫ్ట్ చేయండి.
    చిట్కా: టెక్స్ట్‌ను బోల్డ్ ఇటాలిక్, అండర్లైన్ చేయడానికి, అలాగే ఫోటోలను జోడించడానికి మీరు toolbarను ఉపయోగించవచ్చు. 
  5. మీ పోస్ట్ బాడీని అప్‌డేట్ చేయడానికి, ఎగువన కుడివైపు అప్‌డేట్ Checkmarkను ట్యాప్ చేయండి.
  6. మీ పోస్ట్‌ను కేటగిరీలుగా విభజించడానికి, దాని గురించి ఇతరులకు చెప్పడానికి, లేబుల్‌ల ఫీల్డ్‌లో లేబుల్‌ను ఎంటర్ చేయండి. 
    చిట్కా: ప్రతి ఒక్కటి కామాతో వేరు చేయడం ద్వారా మీరు పోస్ట్‌కు ఒకటి కంటే ఎక్కువ లేబుల్‌లను జోడించవచ్చు.  
  7. ఎగువ కుడివైపు, పబ్లిష్ Sendను ట్యాప్ చేయండి.

మీ పోస్ట్‌ను డ్రాఫ్ట్‌గా సేవ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Blogger యాప్‌Bloggerను తెరవండి.
  2. అడిగితే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేయండి. 
  4. మీ పోస్ట్‌ను పూర్తి చేసినప్పటికీ పబ్లిష్ చేయడానికి మీరు సిద్ధంగా లేకపోతే, పైన ఎడమవైపు, 'మరిన్ని' More ట్యాప్ చేయండి. 
    • మీ డ్రాఫ్ట్‌ను తొలగించడానికి, విస్మరించును ట్యాప్ చేయండి.
    • మీ డ్రాఫ్ట్‌ను సేవ్ చేయడానికి, డ్రాఫ్ట్‌గా సేవ్ చేయండిని ట్యాప్ చేయండి.

ఒక బ్లాగ్ నుండి మరొక బ్లాగ్‌కు మారండి

మీరు ఒకే Google ఖాతాతో క్రియేట్ చేసిన బహుళ బ్లాగ్‌లలో ఒకదాని నుండి మరొక దానికి మారవచ్చు.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Blogger యాప్‌Bloggerను తెరవండి.
  2. అడిగితే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. పైన, మీ బ్లాగ్ పేరును ట్యాప్ చేయండి. 
  4. మీరు మీ అన్ని బ్లాగ్‌ల డ్రాప్-డౌన్ లిస్ట్ నుండి మారాలనుకుంటున్న బ్లాగును ట్యాప్ చేయవచ్చు. 

బ్రౌజర్‌లో మీ బ్లాగ్ లేదా పోస్ట్‌ను చూడండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Blogger యాప్‌Bloggerను తెరవండి.
  2. అడిగితే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. కింది వాటిలో ఒకదానిని ఎంచుకోండి:
    • పోస్ట్‌ను చూడండి: మీ పోస్ట్ ఆ తర్వాత మరిన్ని More ఆ తర్వాతపోస్ట్‌ను చూడండిని ట్యాప్ చేయండి.
    • మీ బ్లాగ్‌ను చూడండి: మీ ప్రొఫైల్ Profile ఆ తర్వాతమీ బ్లాగ్‌ను చూడండిని ట్యాప్ చేయండి.

పోస్ట్‌కు ఫోటోలను జోడించండి 

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Blogger యాప్ Bloggerను తెరవండి.
  2. అడిగితే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. పోస్ట్‌ను తెరవండి.
  4. ఫోటోను జోడించండి: 
    • కెమెరాతో ఫోటో తీయండి: కెమెరా Cameraఆ తర్వాతకెమెరాతో ఫోటో తీయండి ఆ తర్వాతసరే ఎంపిక గుర్తును ట్యాప్ చేయండి.
    • ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫోటోను జోడించండి: ఇమేజ్‌ల ను ట్యాప్ చేసి ఆ తర్వాతఫోటోను ఎంచుకోండి.
చిట్కా: మీరు మీ బ్లాగ్ పోస్ట్‌లలోని ఫోటోలకు లేబుల్‌లను కూడా జోడించవచ్చు. 

ఖాతాలను మార్చడం

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Blogger యాప్ Bloggerను తెరవండి.
  2. అడిగితే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్రొఫైల్‌ను Profile ట్యాప్ చేయండి ఆ తర్వాతమీరు స్విచ్ కావాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  4. ఖాతాను జోడించడానికి, ఖాతాను జోడించండి Addని ట్యాప్ చేయండి ఆ తర్వాతమీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

వెబ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి

మీ పోస్ట్‌లను ఎడిట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ మీకు సహాయపడుతుంది, కానీ కొన్ని ఫీచర్‌లు బ్లాగర్ డ్యాష్‌బోర్డ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

వెబ్‌సైట్‌లో మీరు వీటిని చేయవచ్చు:

  • మీ బ్లాగ్ థీమ్, లేఅవుట్ మార్చవచ్చు
  • కామెంట్‌లు, AdSense, పేజీలను నిర్వహించవచ్చు
  • మీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయవచ్చు
  • మీ బ్లాగ్ గణాంకాలను చూడవచ్చు
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11999863822326003194
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false