నేను నా బ్లాగ్‌కి సైన్ ఇన్ చేయలేకున్నాను

మీ బ్లాగ్‌కి సైన్ ఇన్ చేయడంలో మీకు సమస్య ఉంటే, కింది చిట్కాలు ట్రై చేయండి:

నేను నా యూజర్‌నేమ్‌ని మర్చిపోయాను

  1. "సైన్ ఇన్ చేయడంలో సమస్య ఉందా?" పేజీకి వెళ్లండి.
  2. సూచనలు పాటించండి. మీకు ఇవి అవసరం:
    • మీ ఖాతాలోని పూర్తి పేరు
    • ఖాతాకు సంబంధించిన పునరుద్ధరణ ఇమెయిల్ అడ్రస్ లేదా పునరుద్ధరణ ఫోన్ నంబర్
  3. మీ ఖాతానే అని నిర్ధారించుకోవడానికి ఈ దశలను అనుసరించండి.
    • మీరు పునరుద్ధరణ ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేసి ఉంటే, Google నుండి ఇమెయిల్ కోసం దాని ఇన్‌బాక్స్‌లో చూడండి. ఇమెయిల్‌లోని కోడ్‌ను ఎంటర్ చేయండి.
    • మీరు పునరుద్ధరణ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి ఉంటే, ఆ ఫోన్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్ చేయండి.

మ్యాచ్ అయ్యే యూజర్‌నేమ్‌ల జాబితా మీకు కనిపిస్తుంది.

మీకు మీ యూజర్‌నేమ్ కనిపించకపోతే

  • ఇతర పునరుద్ధరణ ఇమెయిల్ అడ్రస్‌లు లేదా ఫోన్ నంబర్‌లు ట్రై చేయండి.
  • మీ యూజర్‌నేమ్ టైప్ చేయడంలో పొరపాటు చేసి ఉండవచ్చు.
  • మీకు Google ఖాతా లేదు. ఖాతాను క్రియేట్ చేయండి.

నేను నా పాస్‌వర్డ్‌ను మర్చిపోయాను

  1. ఖాతా సపోర్ట్ పేజీకి వెళ్లండి.
  2. సూచనలు పాటించండి. ఇది మీ ఖాతానే అని నిర్ధారించుకోవడానికి, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము. మీకు సాధ్యమైనంత ఉత్తమ సమాధానాలు ఇవ్వండి.
  3. మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి. ఈ ఖాతాతో మీరు ఇది వరకే ఉపయోగించని శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

నేను నా బ్లాగ్ కోసం ఉపయోగించిన ఇమెయిల్ అడ్రస్ నాకు గుర్తు లేదు

  1. "మీ యూజర్‌నేమ్ లేదా పాస్‌వర్డ్ మర్చిపోయారా?" పేజీకి వెళ్లండి.
  2. మీ బ్లాగ్ URLని ఎంటర్ చేయండి.
  3. మీ బ్లాగ్‌తో కనెక్ట్ అయిన ఇమెయిల్ అడ్రస్ గురించి మీరు సూచన పొందుతారు. అలాగే, మీరు సైన్ ఇన్ సూచనల గురించి ఇమెయిల్ కూడా అందుకుంటారు.
  4. మీరు ఇమెయిల్ అందుకుని ఉండకపోతే, బహుశా తప్పు Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండవచ్చు.
  5. మీ ఇమెయిల్ అడ్రస్‌లు లేదా ఫోన్ నంబర్‌లకు ఏయే Google ఖాతాలను లింక్ చేసినది చూడటానికి, 'నా ఖాతాను కనుగొను' పేజీని సందర్శించండి.

నేను నా బ్లాగ్ కోసం ఉపయోగించిన ఇమెయిల్ అడ్రస్‌ని తొలగించాను

పరిమిత సందర్భాలలో, మీరు తొలగించిన ఇమెయిల్ అడ్రస్‌ని ఉపయోగించి Bloggerకి సైన్ ఇన్ చేయగలరు.

  1. Bloggerకి వెళ్లండి.
  2. మీరు మీ బ్లాగ్ కోసం ఉపయోగించిన ఇమెయిల్ అడ్రస్‌ని ఎంటర్ చేయండి.
  3. మీకు గుర్తు ఉన్న చివరి పాస్‌వర్డ్‌ని ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.
  4. మీ బ్లాగ్‌కి అడ్మిన్‌గా యాక్టివ్ Google ఖాతాను యాడ్ చేయండి.

నేను ఇప్పటికీ సైన్ ఇన్ చేయలేకున్నాను

అన్ని బ్లాగ్‌లకు కనీసం ఒక్కరైనా కేటాయించిన అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. మీ బ్లాగ్‌కి అనేక మంది అడ్మినిస్ట్రేటర్‌లు ఉండి, మీకు ఇప్పుడు యాక్సెస్ లేకపోతే, మీ అడ్మిన్ హక్కులు తిరిగి పొందడానికి ఇతర అడ్మిన్‌లను కాంటాక్ట్ చేయడం ట్రై చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4754649955959607496
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false