లేఅవుట్ కోసం విడ్జెట్ ట్యాగ్‌లు
మీరులేఅవుట్‌ల రూపాన్ని ఉపయోగించి మీ బ్లాగ్ ప్రధాన భాగపు రూపం క్రియేట్ చేస్తున్నప్పుడు, ఫోటోల, బ్లాగ్‌రోల్ వంటి పేజీ ఎలిమెంట్‌లను జోడించడానికి మీరు విడ్జెట్‌లను ఉపయోగించవచ్చు.
ట్యాగ్‌ల రకాలు
క్లోజింగ్ ట్యాగ్స్ లో HTML ఉపయోగించడం గురించి ఈ విభాగం వివరిస్తుంది.
(b:include) ఇన్‌క్లూడ్‌లు
ఇన్‌క్లూడ్‌‌లను ఎప్పుడు ఉపయోగించాలి
మీరు ఒక కోడ్ విభాగాన్ని వివిధ స్థలాల్లో పలుమార్లు తిరిగి ఉపయోగించాలన్నా లేదా కొన్ని సందర్భాలలో మాత్రమే చేర్చాలన్నా ఇన్‌క్లూడ్‌లు అధికంగా ఉపయోగపడతాయి.
ఇది చేయడానికి ఒక b:includableలో కంటెంట్‌ను రాయండి, తరువాత ఆ b:include మీకు ఎక్కడ కనిపించాలో అక్కడ దాన్ని ఉపయోగించండి.
ఫార్మాట్
<b:includable id='main' var='thiswidget'>
[మీకు కావలసిన కంటెంట్ ఇక్కడ ఇన్‌సర్ట్ చేయండి]
</b:includable>
లక్షణాలు
• id (కావలెను): అక్షరాలు, సంఖ్యలతో కూడిన ప్రత్యేకమైన ఐడెంటిఫయర్. ప్రతి విడ్జెట్‌కు id='main'తో పాటు ఒక ఇన్‌క్లూడబుల్ ఉండాలి.
• var (ఆప్షనల్) ఈ విభాగంలోని డేటాను సూచించడానికి, అక్షరాలు, సంఖ్యలతో కూడిన ఒక ఐడెంటిఫయర్.
మీరు వివిధ IDలతో మరిన్ని ఇన్‌క్లూడబుల్‌లను చేసినట్లయితే అవి ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే కావు. మీరు ఒక ఇన్‌క్లూడబుల్‌ను id='new'తో చేసినట్లయితే, అప్పుడు మీరు దానిని మీ ప్రధాన ఇన్‌క్లూడబుల్‌లో <b:include name='new' />తో సూచించవచ్చు, ఆపై అది ఆ విధంగా డిస్‌ప్లే అవుతుంది.
ఇన్‌క్లూడ్ ట్యాగ్ ఇతర లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:
• నేమ్ (అవసరం): అక్షరాలు, సంఖ్యలతో ఒక ఐడెంటిఫయర్ నిర్వచించబడుతుంది. అదే విడ్జెట్‌లో ఇప్పటికే ఉన్న b:includable IDతో అది తప్పనిసరిగా మ్యాచ్ కావాలి.
• డేటా (ఆప్షనల్): ఇన్‌క్లూడబుల్ విభాగానికి చేరవేయగలిగే ఒక ఎక్స్‌ప్రెషన్ లేదా డేటా భాగం. ఇన్‌క్లూడబుల్‌లో ఇది వేరియబుల్ లక్షణం యొక్క విలువ అవుతుంది.
• cond (ఆప్షనల్) దాని ఫలితం "ట్రూ" అయితేనే ఇన్‌క్లూడ్‌ను అమలుపరిచేలా చేసే ఎక్స్‌ప్రెషన్. ఒక b:ifలో cond లక్షణానికి కూడా ఇదే వర్తిస్తుంది.
ఉదాహరణ
b:includable మరియు b:includeలను.ఎలా ఉపయోగించాలి అన్న దానికి ఇది ఒక ఉదాహరణ.
"ప్రధాన" విభాగం లోపల "పోస్ట్" విభాగం ఎలా భాగమై ఉంటుంది అనేది ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం. "p" అని పిలవబడే ఒక పోస్ట్‌తో కలిసి ఉంటుంది, ఇన్‌క్లూడెడ్ విభాగం దానిని వేరియబుల్ "పోస్ట్"గా సూచిస్తుంది, ఆపై శీర్షికను ప్రింట్ చేస్తుంది.
ఇండెక్స్ 10 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇన్‌క్లూడ్ రన్ చేస్తుందని గమనించండి, కాబట్టి, ఈ ఉదాహరణలో గరిష్ఠంగా 10 పోస్ట్‌లు మాత్రమే రెండర్ అవుతాయి (ఇండెక్స్ 0 నుంచి మొదలవుతుంది).
<b:includable id='main'>
<b:loop var='p' index='index' values='posts'>
<b:include name='post' data='p' cond='index < 10'/>
</b:loop>
</b:includable>
<b:includable id='post' var='post'>
Title: <data:post.title/>
</b:includable>
అవుట్‌పుట్ డేటా (డేటా:)
ఉదాహరణలు
• <data:title/> అనేది విడ్జెట్ టైటిల్‌ను ప్రింట్ అవుట్ చేస్తుంది
• <data:photo.url/> - Size: <data.photo.width /> x <data.photo.height /> ఫోటో కాంపోనెంట్ యొక్క లక్షణాలను ప్రింట్ చేస్తుంది. ఒక ఫోటోకు URL పొడవు, వెడల్పు వంటి కాంపోనెంట్‌లు ఉండవచ్చు. మనకు వేరే దాని URL కాక ఈ ఫోటో యొక్క URLయే కావాలి అని "." గుర్తు ఉపయోగించడం ద్వారా సూచించవచ్చు.
మరిన్ని ఉదాహరణలు చూడండి
దీనికి సపోర్ట్ చేసే మా layouts data tags మొత్తం లిస్ట్‌ను చూడండి.
లూప్‌లు (b:loop)
b:loop ఎప్పుడు ఉపయోగించాలి
b:loop ట్యాగ్ ఒక విభాగాన్ని పలుమార్లు పునరావృతం చేయమని చెబుతుంది. ఒక పేజీలోని పోస్ట్‌ల లిస్ట్‌లో ప్రతి పోస్ట్ లేదా ప్రతి కామెంట్, ప్రతి లేబుల్ మొదలైన వాటిని ప్రింట్ చేయడానికి ఇది అతి సాధారణంగా ఉపయోగించబడుతుంది.
ఫార్మాట్
ఇది లూప్‌ల కోసం ఉపయోగించే సాధారణ ఫార్మాట్:
<b:loop var='identifier' values='set-of-data'>
[పునరావృతమయ్యే కంటెంట్ ఇక్కడ ఉంటుంది ]
</b:loop>
'ఐడెంటిఫయర్' (i) ఈ భాగం మీరు ఎంచుకొనే ఏ పేరు అయినా కావచ్చు, లిస్ట్‌లోని ప్రతి కొత్త ఐటెమ్‌కు బదులుగా కనిపించడానికి లూప్ అంతటా ఇది వాడబడుతుంది. విలువలకు మీరు నిర్దేశించే డేటా సమితి అనేది, data tags articleలో ఐటెమ్‌ల లిస్ట్‌లోని భాగంగా చెప్పబడిన ఏదైనా డేటా భాగం కావచ్చు.
ఉదాహరణకు, ఈ బ్లాగ్ ‌పోస్ట్‌ల విడ్జెట్‌లో, posts అనేది ఒక లిస్ట్. దిగువ ఉన్న కోడ్ ప్రతి పోస్ట్‌ను లూప్ చేసి, ప్రతి పోస్ట్‌కు శీర్షికను హెడర్ ట్యాగ్‌లతో పాటు ప్రింట్ చేస్తుంది.
<b:loop var='i' values='data:posts'>
<data:i.title/>
</b:loop>
ఒక్కొక్క దాని నుంచి మీకు శీర్షిక లభించడం కోసం, ప్రతి పోస్ట్ యొక్క విలువను "i" ఎలా తీసుకుంటుందో గమనించండి.
సంఖ్య పరిధి
'1 నుండి 3', '-3 నుండి -9' ఈ విధంగా వేరియబుల్ విలువ సంఖ్య విలువను తీసుకునేలాగా ఒక సమేత సంఖ్యల పరిధిని పునరావృతం చేయడానికి లూప్ ట్యాగ్ అనేది మీకు వీలు కల్పిస్తుంది. ఈ దిగువ ఉదాహరణ 1, 2, 3 అనే ఒక క్రమ పద్ధతిలో అమర్చని లిస్ట్‌ను క్రియేట్ చేస్తుంది.
<b:loop var='i' values='1 to 3'>
<data:i />
</b:loop>
ఇండెక్స్ లక్షణం
లూప్ ట్యాగ్‌లు ఆప్షనల్ ఇండెక్స్ లక్షణాన్ని కూడా కలిగి ఉంటాయి, అవి ప్రస్తుతం ఆవృతమవుతున్న లూప్‌నకు సున్నా-ఆధారిత ఇండెక్స్ విలువను ఇస్తాయి.
<b:loop var='number' index='index' values='9 to 7'>
Index: <data:index />, Number: <data:number />
</b:loop>
ఈ ఉదాహరణ క్రమ పద్ధతిలో అమర్చని లిస్ట్‌ను క్రియేట్ చేస్తుంది:
• ఇండెక్స్: 0, సంఖ్య: 9
• ఇండెక్స్: 1, సంఖ్య: 8
• ఇండెక్స్: 2, సంఖ్య: 7
If, elseif & else (b:if)
if, elseif, లేదా else ను ఎప్పుడు ఉపయోగించాలి
b:if, b:elseif and b:else ట్యాగ్‌లు అనేవి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఒక ప్రత్యేకమైన కంటెంట్‌ను, ఇతర సందర్భాలలో వేరే కంటెంట్‌ను డిస్‌ప్లే చేయడానికి మీకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు, మీరు హోమ్ పేజీలో కేవలం ఒక తరహా టెక్స్ట్‌ను మాత్రమే చూపించాలనుకోవచ్చు, కానీ స్వతంత్ర పోస్ట్‌ల కోసం చూసేటప్పుడు మరొక తరహా టెక్స్ట్ వాడాలనుకోవచ్చు.
ఫార్మాట్
<b:if cond='condition'>
[షరతు "ట్రూ" అయితే డిస్‌ప్లే చేయాల్సిన కంటెంట్]
<b:elseif cond='another condition'/>
[మునుపటివి లేదా వేరే షరతులు ఏవీ "ట్రూ" కాకపోయినా, మరియు ఈ వేరే షరతు "ట్రూ" అయినా డిస్‌ప్లే చేయాల్సిన కంటెంట్]
<b:else/>
[షరతు ఏదీ పూర్తి కాకపోయినా లేదా వేరే షరతులు పూర్తి అయినా అయితే డిస్‌ప్లే చేయాల్సిన కంటెంట్]
</b:if>
b:elseif మరియు b:else ట్యాగ్‌లు ఆప్షనల్. ఇవి లేకుండా ఉంటే, ఫలితం b:if విభాగంలో రాసిన కంటెంట్ అవుతుంది లేదా ఏదీ కాదు. ఏమైనా క్లోజింగ్ అనేది </b:if> ప్రతి ఒక్క కేస్‌లోనూ అవసరమవుతుంది.
"షరతు" కోసం ట్రూ లేదా ఫాల్స్ అని నిర్ధారించే దేనినైనా మీరు పెట్టవచ్చు. కొన్ని డేటా ట్యాగ్‌లు స్వతహాగా "ట్రూ"/"ఫాల్స్" విలువలను కలిగి ఉంటాయి, ఉదాహరణకు ఒక పోస్ట్‌లో ఉండే allowComments. ఇతర డేటా భాగాలతో, మీరు ఖచ్చితమైన విలువలను ట్రూ లేదా ఫాల్స్‌తో పోల్చి చూడవచ్చు. కొన్ని ఉదాహరణలు:
• <b:if cond='data:post.showBacklinks'>
ప్రస్తుతం ఉన్న పోస్ట్ వెనుకలింక్‌లను చూపించడానికి సెట్ చేయబడి ఉంటే అది ట్రూ.
• <b:if cond='data:blog.pageType == "item"'>
ప్రస్తుతం ఉన్న పేజీ ఐటెమ్ పేజీ అయితే అది ట్రూ (పోస్ట్ పేజీ).
• <b:if cond='data:blog.pageType == "item" and data:post.showBacklinks'>
ప్రస్తుతం ఉన్న పేజీ ఐటెమ్ పేజీ అయితే (పోస్ట్ పేజీ) మరియు ప్రస్తుత పోస్ట్ వెనుకలింక్‌లను చూపించడానికి సెట్ చేయబడితే ట్రూ.
• <b:if cond='data:displayname != "Fred"'>
ఇది ఫ్రెడ్ డిస్‌ప్లే పేరు కాకపోతే ట్రూ.
• <b:if cond='data:displayname == "Fred" or data:blog.pageType == "static_page"'>
ఫ్రెడ్ డిస్‌ప్లే పేరుగా ఉంటే లేదా ప్రస్తుత పేజీ ఒక స్థిరమైన పేజీ అయితే ట్రూ (పోస్ట్ పేజీ కాదు).
• <b:if cond='data:post.numComments > 1'>
ప్రస్తుత పోస్ట్‌కు ఒకటి కన్నా ఎక్కువ కామెంట్‌లు ఉంటే ట్రూ.
• <b:if cond='data:blog.pageType in {"static_page", "item"}'> OR <b:if cond='{"static_page", "item"} contains data:blog.pageType'>
ప్రస్తుత పేజీ ఒక నిర్దిష్ట పోస్ట్ లేక పేజీ అయితే ట్రూ.
స్విచ్‌లు (b:switch)
Switchను ఎప్పుడు ఉపయోగించాలి
b:switch ట్యాగ్‌ను పలు b:elseif ట్యాగ్‌లు ఉన్న ఒక b:if ట్యాగ్‌ను ఉపయోగించినట్టుగానే ఉపయోగించవచ్చు. switch బ్రాంచ్‌ను ఉపయోగించడం వలన మీరు వేరియబుల్ పేరు ఎక్కువ సార్లు ఉపయోగించక్కరలేదు. ప్రతి కేస్‌లో ఏమి నిర్వచించబడి ఉందో, ఆటోమేటిక్ కేస్ ఏది అన్నది మీరు వాటిని చూసి సులభంగా చదవవచ్చు.
ఫార్మాట్
<b:switch var='[Data expression]'>
<b:case value="[Value 1]" />
[Output if evaluation of var is equal to Value 1]
<b:case value="[Value 2]" />
[Output if evaluation of var is equal to Value 2]
[… any other values]
<b:default />
[b:case లో నిర్వచించిన వాటిలో దేనితోనూ మూల్యీకరించిన వేరియబుల్ సమానము కాకపోతే అవుట్‌పుట్ చేయి]
</b:switch>
ఉదాహరణ
ఏ విధమైన పేజీ రెండర్ అవుతుందో అనే దాని ఆధారంగా ఒక ప్రత్యేక హెడర్‌ను ఎలా అవుట్‌పుట్‌గా చూపించాలో ఈ ఉదాహరణ వివరిస్తుంది.
<b:switch var='data:blog.pageType'>
<b:case value="static_page" />
Page
<b:case value="item" />
Post
<b:default />
బ్లాగ్ పోస్ట్‌లు
</b:switch>
లక్షణం ఎక్స్‌ప్రెషన్‌లు (expr)
ఎక్స్‌ ప్రెషన్‌లను ఎప్పుడు ఉపయోగించాలి
మీరు expr లక్షణాన్ని డేటా డిక్షనరీ ఆధారంగా లక్షణం విలువలు సెట్ చేయడానికి ఉపయోగించవచ్చు.
ఉదాహరణలు
• Home
బ్లాగ్ హోమ్‌పేజీ URLతో ఉన్న ఒక హోమ్ లింక్.
• Posts RSS
ఒక బ్లాగ్ RSS ఫీడ్ తరువాత ఉన్న పోస్ట్ యొక్క URL లింక్. ‘+' సంకేతం రెండు స్ట్రింగ్‌లను జోడిస్తుంది.
కామెంట్‌లను అనుమతిస్తే "comment" అని లేకుంటే "no-comment" అనే క్లాస్‌తో ఉన్న లింక్. టెర్‌నరీ ఆపరేటర్ (?:) ఇచ్చిన బూలియన్ విలువలను బూలియన్ "ట్రూ" అయితే (? తరువాత) ఉన్న మొదటి విలువను, బూలియన్ "ఫాల్స్" అయితే (: తరువాత) ఉన్న రెండవ విలువను బూలియన్ విలువగా తీసుకుంటుంది.
మూల్యాంకనం చేసిన ఎక్స్‌ప్రెషన్‌లు (b:eval)
మూల్యాంకనం చేసిన ఎక్స్‌ప్రెషన్‌ను ఎపుడు ఉపయోగించాలి
ఒక స్టాండర్డ్ డేటా ట్యాగ్ కంటే మరింత కఠినమైన ఎక్స్‌ప్రెషన్‌లు మూల్యాంకనం చేయడానికి b:eval ట్యాగ్‌ను ఉపయోగించవచ్చు.
ఫార్మాట్
<b:eval expr='[Expression]' />
ఉదాహరణలు
• min-height: <b:eval expr="data:newWidth * data:height / data:width" />px;
కొత్త వెడల్పు విలువను ఆధారంగా గణించిన సంబంధిత ఎత్తును అవుట్‌పుట్‌గా చూపిస్తుంది.
• <b:eval expr="data:post.labels[0].url" />
మొదటి పోస్ట్.లేబుల్ URLను అవుట్‌పుట్‌గా చూపిస్తుంది.
• <b:eval expr='data:post.allowComments ? "Comment" : "Comments Disabled" />
కామెంట్‌లకు అనుమతి ఉంటే "Comment" మరియు అనుమతి లేకుంటే "Comments Disabled" అని అవుట్‌పుట్ చూపిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెషన్, టెర్‌నరీ ఆపరేటర్‌ను ఉపయోగిస్తుందని గమనించండి.
వేరియబుల్ మారుపేరు (b:with)
వేరియబుల్ ప్రత్యామ్నాయాన్ని ఎప్పుడు ఉపయోగించవచ్చు
గణించగా వచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్ విలువను తాత్కాలికంగా స్టోర్ చేయడానికి, సంక్లిష్టమైన ఇన్‌లైన్ ఎక్స్‌ప్రెషన్‌లను నివారించడానికి b:withను మీరు ఉపయోగించవచ్చు.
ఫార్మాట్
<b:with var='myComputedValue' value='[Data expression]' />
ఉదాహరణలు
డేటా వేరియబుల్‌పై ఆధారపడిన ఒక సంక్లిష్టమైన స్టైల్ లక్షణాన్ని HTML అవుట్‌పుట్ కంటే ముందే గణించడం వలన, మీరు సమూహంగా ఉన్న HTMLను సులభంగా చదవగలుతారు.
<b:with var='style'
value='"background-image: url(\"" + data:sourceUrl "\"); "
+ " width: " + data:width + "px; " '>
My Header
</b:with>
b:withట్యాగ్ యొక్క ఉప నోడ్‌లలో మాత్రమే వేరియబుల్ ఉండబోతుందని గమనించండి.
ఒక ఉదాహరణ చూడండి
ఈ అన్ని ట్యాగ్‌లు మీ బ్లాగ్‌లో HTMLలో పేజీ లిస్ట్ విడ్జెట్‌లో ఎలా ఉపయోగించబడతాయో తెలుసుకోడానికి ఒక ఉదాహరణ చూడడానికి క్లిక్ చేయండి.
ఉదాహరణ
ఈ విడ్జెట్‌లో మీరు ట్యాగ్‌లను ఉపయోగించే ఉదాహరణలను చూస్తారు b:widget, b:includable (మరియు b:include), b:if (మరియు b:else) మరియు b:loop.
<b:widget id='PageList1' locked='false' title='Pages' type='PageList'>
<b:includable id='main'>
<b:if cond='data:title != ""'>
<data:title/>
</b:if>
<b:if cond='data:mobile'>
<select expr:id='data:widget.instanceId + "_select"'>
<b:loop values='data:links' var='link'>
<b:if cond='data:link.isCurrentPage'>
<option expr:value='data:link.href' selected='selected'><data:link.title/></option>
<b:else/>
<option expr:value='data:link.href'><data:link.title/></option>
</b:if>
</b:loop>
</select>
<b:else/>
<b:loop values='data:links' var='link'>
<b:if cond='data:link.isCurrentPage'>
<data:link.title/>
<b:else/>
<data:link.title/>
</b:if>
</b:loop>
</b:if>
<b:include name='quickedit'/>
</b:includable>
</b:widget>
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9577701192941005219
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false