మీ బ్లాగ్‌కు ఇమేజ్‌లు, & వీడియోలను జోడించండి

మీరు క్రియేట్ చేసే బ్లాగ్ పోస్ట్‌లు వేటికైనా మీరు ఫోటోలు, ఇతర ఇమేజ్‌లు, వీడియోలను యాడ్ చేయవచ్చు.

గమనిక:

  • వేరెవరో వ్యక్తి హోస్ట్ చేసిన కంటెంట్‌ను వారి సమ్మతి లేకుండా హోస్ట్ చేయడం నివారించండి.
  • కాపీరైట్ చేసిన మెటీరియళ్లను ప్రామాణీకరణ లేకుండా వినియోగించడం నివారించండి. Blogger కాపీరైట్ పాలసీ గురించి మరింత తెలుసుకోండి.
  • మా కంటెంట్ పాలసీని ఉల్లంఘించే కంటెంట్‌ని యాడ్ చేయడం నివారించండి. అంటే, సబ్జెక్ట్ సమ్మతి లేకుండా పోస్ట్ చేసిన అందరికీ తగని ఇమేజ్‌లు, ద్వేషపూరిత, హింసాత్మక లేదా మోటుగా ఉండే అసభ్యకర కంటెంట్ కూడా నివారించాలి.

బ్లాగ్ పోస్ట్‌కి ఇమేజ్‌ని యాడ్ చేయండి

బ్లాగర్‌కు అప్‌లోడ్ చేయబడిన ఇమేజ్‌లు వెబ్ కోసం కంప్రెస్ చేయబడి, ఆప్టిమైజ్ చేయబడవచ్చు, దీని ఫలితంగా రీడర్‌లకు తక్కువ డేటా వినియోగం, అలాగే వేగవంతమైన లోడ్ సమయాలు ఉంటాయి. ఈ ఇమేజ్‌లు మీ Google స్టోరేజ్ కోటాలో భాగంగా లెక్కించబడవు. ప్రస్తుతం బ్లాగర్‌లో పెద్ద ఇమేజ్‌లను ఒరిజినల్ క్వాలిటీతో స్టోర్ చేయడానికి ఎటువంటి మార్గం లేదు.

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. అప్‌డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
  4. ఇమేజ్‌లను యాడ్ చేయడానికి కొత్త పోస్ట్‌ని క్రియేట్ చేయండి లేదా ఇప్పటికే ఉన్న పోస్ట్‌ని ఎడిట్ చేయండి.
  5. పోస్ట్ ఎడిటర్‌లో, 'ఇమేజ్‌ని ఇన్‌సర్ట్ చేయి' Insert image క్లిక్ చేయండి.
  6. మీరు దేని నుండి ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  7. అప్‌లోడ్ చేయాల్సిన ఒకటి లేదా మరిన్ని ఇమేజ్‌లను ఎంచుకోండి.
  8. 'ఎంపిక చేసినవి యాడ్ చేయి' క్లిక్ చేయండి.
  9. మీ పోస్ట్‌లో ఇమేజ్ ఉన్నప్పుడు, దానిపై క్లిక్ చేయడం ద్వారా సైజ్, క్యాప్షన్ లేదా పేజీలో అమర్చును మార్చండి.

Manage your images

ఓవర్‌లేలో ఇమేజ్‌లు తెరవకుండా ఆపివేయండి
గమనిక: మీరు డైనమిక్ వీక్షణలు ఆన్ చేసి ఉంటే, దానిని ఆఫ్ చేయడం ద్వారా మాత్రమే మీ బ్లాగ్‌లోని ఇమేజ్‌లను తెరవవచ్చు.

ఆటోమేటిక్‌గా, మీ బ్లాగ్‌లోని ఇమేజ్‌లు లైట్‌బాక్స్ అని పిలిచే పెద్ద ఓవర్లేలో తెరవబడతాయి. లైట్‌బాక్స్‌లో ఇమేజ్‌లు తెరవకుండా నిరోధించడానికి:

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. అప్‌డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
  4. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు ఆ తర్వాత పోస్ట్‌లు, కామెంట్‌లు, షేరింగ్ ఎంపికలను క్లిక్ చేయండి.
  5. "పోస్ట్‌లు" దిగువున, “లైట్‌బాక్స్‌తో ఇమేజ్‌లను షోకేస్ చేయి" కనుగొని, 'వద్దు' ఎంచుకోండి.
ఆల్బమ్‌లోని ఇమేజ్‌లను తొలగించండి
మీరు ఎప్పుడైనా మీ ఆల్బమ్ ఆర్కైవ్ నుండి ఇమేజ్‌లను తొలగించవచ్చు. మీరు ఆల్బమ్ ఆర్కైవ్‌లోని మీ బ్లాగ్ ఆల్బమ్ నుండి ఒక ఇమేజ్‌ని తొలగిస్తే, అది మీ బ్లాగ్ నుండి కూడా తొలగించబడుతుంది.
గమనిక: మీరు ఒక ప్రైవేట్ ఫోల్డర్‌లోని ఫోటోని మీ బ్లాగ్‌లో ఉంచితే, ఆ ఫోల్డర్‌లోనూ, అదే విధంగా ఆల్బమ్ ఆర్కైవ్‌లోనూ ఒక కాపీ కనిపించవచ్చు. మీరు ఆ ఫోటోని ఆల్బమ్ ఆర్కైవ్ నుండి సంపూర్ణంగా తీసివేయాలనుకుంటే, ఆ రెండు స్థలాల నుండి దానిని తొలగించాలి: ప్రైవేట్ ఫోల్డర్, ఆల్బమ్ ఆర్కైవ్‌లోని బ్లాగ్ ఆల్బమ్.

వీడియోని మీ బ్లాగ్‌కి యాడ్ చేయండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. అప్‌డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
  4. వీడియోని యాడ్ చేయడానికి కొత్త పోస్ట్‌ని క్రియేట్ చేయండి లేదా ఇప్పటికే ఉన్న పోస్ట్‌ని ఎడిట్ చేయండి.
  5. పోస్ట్ ఎడిటర్‌లో, 'వీడియోని ఇన్‌సర్ట్ చేయి' Insert a video క్లిక్ చేయండి.
  6. మీరు ఉపయోగించాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి.

మీ వీడియోలను నిర్వహించండి

మీరు మీ బ్లాగ్‌కి అప్‌లోడ్ చేసిన అన్ని వీడియోలను చూడవచ్చు, డౌన్‌లోడ్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. పైభాగంలో ఎడమ వైపున, కిందికి బాణం గుర్తు కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. మీరు వీడియోలను మేనేజ్ చేయాలనుకుంటున్న బ్లాగ్‌పై క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు ఆ తర్వాత ఇతరం క్లిక్ చేయండి.
  5. "దిగుమతి & బ్యాకప్" దిగువున, "మీ బ్లాగ్‌లోని వీడియోలు" కనుగొని, 'మీ వీడియోలను నిర్వహించండి' ఎంపికను క్లిక్ చేయండి. మీ వీడియో లైబ్రరీ కొత్త విండోలో తెరవబడుతుంది.
  6. వీడియోని తొలగించడానికి, తొలగించు క్లిక్ చేయండి. వీడియోని డౌన్‌లోడ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయి క్లిక్ చేయండి.

అప్‌లోడింగ్ సమస్యలు పరిష్కరించండి

మీకు ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయడంలో సమస్యలు ఉంటే, మీ కాష్, కుక్కీలు క్లియర్ చేసి, ఆ తర్వాత ఈ దశలు ట్రై చేయండి:

  • మీ పాప్-అప్ బ్లాకర్‌ని ఆఫ్ చేయండి లేదా మీ పాప్-అప్ బ్లాకర్ సెట్టింగ్‌లలో Blogger.comని యాడ్ చేయండి.
  • మీరు మీ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఏవైనా ప్లగ్ఇన్‌లను ఆఫ్ చేయండి.
  • Google Chrome, Mozilla Firefox, Internet Explorer తాజా వెర్షన్‌లను ట్రై చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6879860328157785985
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false