సెర్చ్ ఇంజిన్‌లో మీ బ్లాగ్‌ను కనుగొనడానికి వ్యక్తులకు సహాయం చేయండి

మీరు ఇవి చేసినప్పుడు, Google, Bing వంటి సెర్చ్ ఇంజిన్‌లలో మీ బ్లాగ్‌ను కనుగొనడాన్ని వ్యక్తులకు సులభతరం చేయవచ్చు:

  • సెర్చ్ ఇంజిన్‌లలో మీ బ్లాగ్‌ను లిస్ట్‌లో చేర్చండి.
  • సెర్చ్ ఫలితాలలో మీ సైట్ ఎక్కువగా కనిపించేలా సహాయపడటానికి, కీవర్డ్‌లను మీ సైట్ అంతటా ఉపయోగించండి.

సెర్చ్ ఇంజిన్‌లలో మీ బ్లాగ్‌ను లిస్ట్‌లో చేర్చండి.

మీ బ్లాగ్‌ను సెర్చ్ ఇంజిన్‌లు కనుగొనేలా చెయ్యడానికి:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, లిస్ట్‌లో చేర్చడానికి బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున ఉన్న మెనూలో, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  4. "గోప్యత" కింద, సెర్చ్‌ఇంజిన్‌లకు కనిపించేలా చేయిని ఆన్ చేయండి.

మీ బ్లాగ్‌కు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్(SEO) చిట్కాలు

మీ పోస్ట్‌లు పేజీలలోని, శీర్షికలు, టెక్స్ట్‌కు సంబంధించిన కీవర్డ్‌లను ఉపయోగించవచ్చు సెర్చ్ ఇంజిన్‌లకు ఏ పేజీలు, పోస్ట్‌లు, ఇంకా లింక్‌లను విస్మరించాలో కూడా మీరు చెప్పవచ్చు, అప్పుడు సెర్చ్ ఫలితాలలో అవి కనిపించవు.

మీ పోస్ట్‌కు, పేజీ శీర్షికలకు కీవర్డ్‌లను జోడించండి

సెర్చ్‌లలో మీ పోస్ట్‌ల, పేజీల ర్యాంకింగ్‌ను మెరుగుపరచడానికి:

  • ఆ పోస్ట్‌లేదా పేజీ గురించి వివరించే కీవర్డ్ లను చేర్చండి.
  • మీ శీర్షికలు 60 అక్షరాలు లోపు ఉండే విధంగా చూసుకోండి. చిన్న, సంక్షిప్త శీర్షికలు మరింత చదవగలిగేవిగా ఉంటాయి, కత్తిరించబడవు.

హెడర్‌లను జోడించండి

మీ పోస్ట్ దేని గురించి అనేది సెర్చ్ ఇంజిన్‌లకు చెప్పడానికి H1, H2, H3, లాంటి హెడర్‌లను, మరిన్నిటిని మీరు జోడించవచ్చు. హెడర్‌లు జోడించడానికి:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమవైపున, మీరు హెడర్‌ను జోడించాలనుకున్న బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున ఉన్న మెనూలో, పోస్ట్‌లను క్లిక్ చేయండి.
  4. మీరు ఎడిట్ చేయాలనుకున్న పోస్ట్ శీర్షికను క్లిక్ చేయండి.
  5. మీరు హెడర్‌గా తయారు చెయ్యాలనుకుంటున్న టెక్స్ట్‌ను హైలైట్ చేయండి.
  6. మెనూలో, పేరాగ్రాఫ్‌Menuను క్లిక్ చేయండి.
  7. మీరు కావాలనుకుంటున్న హెడింగ్ రకాన్ని ఎంచుకోండి.

మీ ఇమేజ్‌లను సెర్చ్‌లో కనపడే విధంగా చేయండి

మీ ఇమేజ్‌లు సెర్చ్‌లో కనబడే విధంగా, రీడర్‌లు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి, మీరు ఒక చిన్న వివరణ, ప్రత్యామ్నాయ టెక్స్ట్ లేదా టైటిల్‌ను జోడించవచ్చు:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, ఒక బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. మీ పోస్ట్‌కు ఇమేజ్‌ను జోడించండిని క్లిక్ చేయండి.
  4. ఎడిట్ Editను క్లిక్ చేయండి.
  5. టెక్స్ట్ బాక్స్‌లో: 
    • “ఆల్ట్” విభాగంలో: సుదీర్ఘ వివరణను జోడించండి.
    • "శీర్షిక" విభాగంలో: సంక్షిప్త వివరణను జోడించండి.
  6. అప్‌డేట్ చేయిని క్లిక్ చేయండి.

సెర్చ్‌ల నుండి పేజీలను దాచండి

ముఖ్య గమనిక: మీరు ఎంచుకొన్న ట్యాగ్‌ల కిందకు వచ్చే పోస్ట్‌లను, పేజీలను మీరు దాచవచ్చు. నిర్దిష్ట పోస్ట్‌లను బ్లాక్ చేయడానికి, పోస్ట్ ఎడిటర్ సెట్టింగ్‌లలో, "అనుకూల రోబోట్‌ల ట్యాగ్‌లు," కింద ఇండెక్స్ చేయవద్దును ఆన్ చేయండి.

సెర్చ్ ఇంజిన్‌లలో నిర్దిష్ట పేజీలు లేదా పోస్ట్‌లు కనుగొనబడకుండా ఉండాలంటే, వాటిని దాచవచ్చు. పేజీలను దాచడానికి:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, ఒక బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున ఉన్న మెనూలో, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  4. "క్రాలర్‌లు, ఇండెక్సింగ్" కింద, అనుకూల రోబోట్‌ల హెడర్ ట్యాగ్‌లను ఎనేబుల్ చేయిని ఆన్ చేయండి.
  5. మొదటి పేజీ ట్యాగ్‌లను, ఆర్కైవ్, సెర్చ్ పేజీ ట్యాగ్‌లను, లేదా పోస్ట్, పేజీ ట్యాగ్‌లను క్లిక్ చేయండి.

కొన్ని నిర్దిష్ట లింక్‌లను ఫాలో చేయవద్దని సెర్చ్ ఇంజిన్‌లకు చెప్పండి

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, ఒక బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున ఉన్న మెనూలో, పోస్ట్‌లను క్లిక్ చేయండి.
  4. మీరు దాచాలనుకుంటున్న పోస్ట్‌ను క్లిక్ చేయండి.
  5. ఎగువన, లింక్ లింక్‌ను ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత URLను క్రియేట్/ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
  6. ‘rel=nofollow’ లక్షణాన్ని జోడించు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
  7. సరేని క్లిక్ చేయండి.

మీ URLను మార్చండి లేదా మళ్లించండి

URLలను మళ్లీ రాయండి

మీ పోస్ట్‌లను మరింత చదవగలిగే విధంగా చేయడానికి, అలాగే అవి వేటికి సంబంధించినవో సెర్చ్ ఇంజిన్‌లకు తెలియజేయడానికి, మీ పోస్ట్‌ల URLను మీరు తిరిగి రాయవచ్చు: 

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, అప్‌డేట్ చేయడానికి ఒక బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున ఉన్న మెనూలో, పోస్ట్‌లు ఆ తర్వాత కొత్త పోస్ట్ New postను క్లిక్ చేయండి.
  4. కుడివైపున ఉన్న, "పోస్ట్ సెట్టింగ్‌లు" కింద, శాశ్వత లింక్‌ను క్లిక్ చేయండి.
  5. అనుకూల శాశ్వత లింక్‌ను ఎంచుకొని, మీరు ఉపయోగించాలనుకున్న URLను ఎంటర్ చేయండి.
  6. పబ్లిష్ లేదా సేవ్‌ను క్లిక్ చేయండి.

URLకు మళ్లింపును క్రియేట్ చేయండి

మీ బ్లాగ్ నుండి కొత్త పోస్ట్‌లు లేదా పేజీలకు URLను మళ్లించడానికి:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, ఒక బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపున ఉన్న మెనూలో, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  4. "ఎర్రర్‌లు, మళ్లింపులు" కింద, అనుకూల మళ్లింపులు ఆ తర్వాత జోడించండిని క్లిక్ చేయండి.
  5. తొలగించిన URLతో పాటు, మీరు దానిని దేనికి మళ్లించాలనుకుంటున్నారో ఆ URLను జోడించండి. 
    • ఒకవేళ ఒరిజినల్ కథనం తొలగించబడినట్లయితే, శాశ్వతంను ఆన్ చేయండి.
  6. సరే ఆ తర్వాత సేవ్ చేయిని క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10195585352990516944
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false