పేజీలను మీ బ్లాగ్‌కి యాడ్ చేయండి

మీరు ఒకే రీతిలో ఉండే “పరిచయం” లేదా “కాంటాక్ట్” లాంటి కంటెంట్ కోసం పేజీలను క్రియేట్ చేయవచ్చు. పేజీలు మీ బ్లాగ్‌లో ట్యాబ్‌లుగా లేదా పక్క వైపు లింక్‌లుగా కనిపిస్తాయి.

గమనిక: మీరు నిర్దిష్ట పోస్ట్‌లను పేజీలుగా ఉపయోగించలేరు.

దశ 1: మీ పేజీలను చూపించండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  3. అప్‌డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
  4. ఎడమ వైపు మెనూలో ఉన్న, 'లేఅవుట్' క్లిక్ చేయండి.
  5. మీరు మీ పేజీలను చూపాలనుకుంటున్న విభాగంలో, 'గాడ్జెట్‌ని యాడ్ చేయి' క్లిక్ చేయండి.
  6. విండోలో, "పేజీలు" పక్కన, 'యాడ్ చేయి'  క్లిక్ చేయండి.
  7. మీ సెట్టింగ్‌లు సెట్ చేసి, 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.
  8. ఎగువున కుడి వైపు, 'అరేంజ్‌మెంట్‌ని సేవ్ చేయి' క్లిక్ చేయండి.

మీ పేజీలు ఎక్కడ కనిపించాలన్నది మార్చడానికి, గాడ్జెట్‌ని దాని కొత్త లొకేషన్‌కి లాగండి.

దశ 2: పేజీలను క్రియేట్ చేయండి, ఎడిట్ చేయండి లేదా తొలగించండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  3. అప్‌డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
  4. ఎడమ వైపు మెనూలో, పేజీలు క్లిక్ చేయండి.
    • కొత్త పేజీని క్రియేట్ చేయండి: కొత్త పేజీని క్లిక్ చేయండి. పేజీ టైటిల్, ఇతర సమాచారం ఎంటర్ చేసి, సేవ్ చేయి, ప్రివ్యూ చూపించు, లేదా పబ్లిష్ చేయి క్లిక్ చేయండి.
    • పేజీని ఎడిట్ చేయండి: మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న పేజీ దిగువున, ఎడిట్ చేయి క్లిక్ చేయండి. మీ పేజీని అప్‌డేట్ చేసి, సేవ్ చేయి, ప్రివ్యూ చూపించు, లేదా పబ్లిష్ చేయి క్లిక్ చేయండి.
    • పేజీని తొలగించండి: మీరు తీసివేయాలనుకుంటున్న పేజీ దిగువున, తొలగించు ఆ తర్వాత సరే క్లిక్ చేయండి.

మరొక వెబ్‌సైట్‌కి లింక్‌ని క్రియేట్ చేయండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.

  2. ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  3. అప్‌డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
  4. ఎడమ వైపు మెనూలో ఉన్న, 'లేఅవుట్' క్లిక్ చేయండి.
  5. “పేజీలు” విభాగంలో, 'ఎడిట్ చేయి ఎడిట్ చేయండి' క్లిక్ చేయండి.
  6. "చూపాల్సిన పేజీలు" దిగువున, '+ బయటి లింక్‌ని యాడ్ చేయి' క్లిక్ చేయండి.
  7. పేజీ టైటిల్, URLని ఎంటర్ చేసి, 'లింక్‌ని సేవ్ చేయి' క్లిక్ చేయండి.

దశ 3: చూపాల్సిన పేజీలను ఎంచుకోండి

  1. ఎడమ వైపు మెనూలో ఉన్న, 'లేఅవుట్' క్లిక్ చేయండి.
  2. “పేజీలు” విభాగంలో, 'ఎడిట్ చేయి ఎడిట్ చేయండి' క్లిక్ చేయండి.
  3. మీరు చూపాలనుకుంటున్న పేజీలను ఎంచుకోండి.
  4. 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.
  5. ఎగువున కుడి వైపు, 'అరేంజ్‌మెంట్‌ని సేవ్ చేయి' క్లిక్ చేయండి.

మీరు ఒక బ్లాగ్‌లో కలిగి ఉండగలిగే పేజీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8115577709882368382
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false