పోస్ట్‌ని క్రియేట్ చేయండి, ఎడిట్ చేయండి, మేనేజ్ చేయండి లేదా తొలగించండి

మీరు ఎప్పుడైనా పోస్ట్‌లు, డ్రాఫ్ట్‌లను వ్రాయవచ్చు, ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.

కొత్త పోస్ట్‌ను వ్రాయండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. కొత్త పోస్ట్ New post క్లిక్ చేయండి.
  3. పోస్ట్‌ని క్రియేట్ చేయండి.
    • మీ పోస్ట్‌ను పబ్లిష్ చేసినప్పుడు అది ఎలా కనిపిస్తుందో సరిచూసుకోవడానికి, 'ప్రివ్యూ చూడండి' క్లిక్ చేయండి.
  4. మీ పోస్ట్‌ని సేవ్ చేయండి లేదా పబ్లిష్ చేయండి:
    • సేవ్ చేసి, పబ్లిష్ చేయకుండా ఉంచడానికి: సేవ్ చేయి క్లిక్ చేయండి.
    • పబ్లిష్ చేయడానికి: పబ్లిష్ చేయి క్లిక్ చేయండి.

మీ పోస్ట్‌కి లేబుల్‌లను యాడ్ చేయండి

మీరు లేబుల్‌లు ఉపయోగించడం ద్వారా మీ పోస్ట్‌లను నిర్వహించవచ్చు. మీ పాఠకులు వారికి వచ్చే కంటెంట్‌ని ఫిల్టర్ చేయడానికి మీ లేబుల్‌లను ఉపయోగించగలరు.

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎడిటర్ వీక్షణని తెరవడానికి, ఇప్పటికే ఉన్న పోస్ట్‌పై క్లిక్ చేయండి లేదా కొత్త పోస్ట్ New post క్లిక్ చేయండి.
  3. కుడి వైపు, లేబుల్‌లు Label క్లిక్ చేయండి.
  4. లేబుల్‌ని ఎంటర్ చేయండి లేదా ఇప్పటికే ఉన్న లేబుల్‌పై క్లిక్ చేయండి.
    • పోస్ట్‌కి ఒకటి కంటే ఎక్కువ లేబుల్‌లను యాడ్ చేయడానికి, లేబుల్‌లను కామాలతో వేరు చేయండి.

చిట్కా: మీ డ్యాష్‌బోర్డ్‌లో టైటిల్ పక్కన, మీరు మీ లేబుల్‌లను కనుగొనవచ్చు.

మీ పోస్ట్‌లను లేబుల్‌లతో ఫిల్టర్ చేయండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ కుడి వైపు, లేబుల్‌లు Label క్లిక్ చేయండి.
  3. ఎన్ని లేబుల్‌లు కావాలో ఎంచుకోండి.
  4. ఆ తర్వాత, వర్తింపజేయి క్లిక్ చేయండి.

పోస్ట్‌ని పబ్లిష్ చేయండి

పోస్ట్‌ను షెడ్యూల్ చేయండి
  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. బ్లాగ్ పేరు దిగువున, పోస్ట్‌లు Posts ఆ తర్వాత మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్న పోస్ట్ టైటిల్‌ని క్లిక్ చేయండి.
  3. కుడి సైడ్‌బార్‌లో, Published onలో 'పబ్లిష్ అయినది' పక్కన, డ్రాప్-డౌన్ బాణాన్ని కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  4. 'తేదీ, సమయం సెట్ చేయండి' ఎంపికను ఎంచుకోండి.
  5. క్యాలెండర్‌లో తేదీ, సమయాలు ఎంచుకుని, ఆ తర్వాత 'పబ్లిష్ చేయి' క్లిక్ చేయండి.
    • మీరు ఒక పబ్లిష్ అయిన పోస్ట్‌ని రీషెడ్యూల్ చేయాలనుకుంటే, 'తిరిగి డ్రాఫ్ట్‌కి మార్చు' క్లిక్ చేయండి.

మీ టైమ్ జోన్‌ని సెట్ చేయడానికి:

  1. ప్రధాన డ్యాష్‌బోర్డ్ ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు Settings క్లిక్ చేయండి.
  2. “ఫార్మాటింగ్” విభాగానికి వెళ్లి, టైమ్‌జోన్ క్లిక్ చేయండి.
  3. పాప్-అప్ విండోలో, టైమ్ జోన్‌ని ఎంచుకోండి.
  4. 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.
మీ బ్లాగ్‌లో పోస్ట్ చేయడానికి ఇమెయిల్‌ని ఉపయోగించండి

ఇమెయిల్‌ని క్రియేట్ చేయడానికి:

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. పైభాగంలో ఎడమవైపున, కిందకు ఉన్న బాణం గుర్తును కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. బ్లాగ్ పేరును క్లిక్ చేయండి.
  4. ప్రధాన డ్యాష్‌బోర్డ్ ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు Settings క్లిక్ చేయండి.
  5. “ఇమెయిల్” విభాగానికి వెళ్లి, 'ఇమెయిల్‌ని ఉపయోగించి పోస్ట్ చేయండి' ఎంపికను క్లిక్ చేయండి.
  6. పాప్-అప్ విండోలో, 'ఇమెయిల్‌ని వెంటనే పబ్లిష్ చేయి' లేదా 'ఇమెయిల్‌లను డ్రాఫ్ట్ పోస్ట్‌లుగా సేవ్ చేయి' ఎంపికలను క్లిక్ చేయండి.
  7. “పోస్ట్ చేయడం కోసం ఇమెయిల్ ఉపయోగించండి” దిగువున, పోస్ట్‌ల కోసం ఉపయోగించాల్సిన ఇమెయిల్ అడ్రస్‌ని క్రియట్ చేయండి.
  8. 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.

ఇమెయిల్ ద్వారా పోస్ట్ చేయడానికి:

Important: Anyone who emails this unique email address will be able to post on your blog, as you.

  1. కొత్త ఇమెయిల్‌ని క్రియేట్ చేయండి.
  2. ఇమెయిల్ సబ్జెక్ట్‌లో, మీ పోస్ట్ యొక్క టైటిల్‌ని ఎంటర్ చేయండి.
  3. ఇమెయిల్ ప్రధాన విషయంలో, మీ పోస్ట్‌ని ఎంటర్ చేయండి.
    • మీ పోస్ట్ ముగింపును గుర్తించడానికి, #endని ఎంటర్ చేయండి.
    • ఇమేజ్‌ని యాడ్ చేయడానికి మీ ఇమెయిల్‌కి ఇమేజ్‌ని అటాచ్ చేయండి.
  4. మీరు క్రియేట్ చేసిన ఇమెయిల్ అడ్రస్‌కి ఇమెయిల్‌ని పంపండి: (username.[secretword]@blogger.com).

పోస్ట్‌ని ఎడిట్ చేయండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. బ్లాగ్ పేరు దిగువున, పోస్ట్‌లు క్లిక్ చేయండి.
  3. పోస్ట్ టైటిల్‌పై క్లిక్ చేయండి.
  4. మీ మార్పులు చేయండి.
    • మీ పోస్ట్‌ను పబ్లిష్ చేసినప్పుడు అది ఎలా కనిపిస్తుందో సరిచూసుకోవడానికి, 'ప్రివ్యూ చూడండి' క్లిక్ చేయండి.
  5. ఈ విధమైన పోస్ట్‌ల కోసం:
    • పబ్లిష్ అయి ఉంటే: 'అప్‌డేట్ చేయి' లేదా 'తిరిగి డ్రాఫ్ట్‌కి మార్చు' క్లిక్ చేయండి.
    • పబ్లిష్ కాకుండా ఉంటే: 'పబ్లిష్ చేయి' లేదా 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.

పోస్ట్‌ని తొలగించండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. పైభాగంలో ఎడమవైపున, కిందకు ఉన్న బాణం గుర్తును కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. బ్లాగ్ పేరును క్లిక్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న పోస్ట్‌ను సూచించండి. అది కనిపించినప్పుడు, 'తొలగించు' Delete క్లిక్ చేయండి.

పోస్ట్‌కి ఫార్మాట్ యాడ్ చేయండి

“మరింత చదవండి” లింక్‌ని యాడ్ చేయండి
మీ బ్లాగ్ ఇండెక్స్ పేజీలో, పాఠకులు పోస్ట్ ప్రివ్యూ చూసి, ఆ తర్వాత "మరింత చదవండి" లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా పూర్తి పోస్ట్‌ని చూడగలరు.
  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. పైభాగంలో ఎడమవైపున, కిందకు ఉన్న బాణం గుర్తును కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. బ్లాగ్ పేరును క్లిక్ చేయండి.
  4. మీరు లింక్‌ను యాడ్ చేయాలనుకుంటున్న పోస్ట్‌పై క్లిక్ చేయండి.
  5. కంపోజర్ బాక్స్‌లో, మీరు "మరింత చదవండి" లింక్‌ని యాడ్ చేయాలనుకుంటున్న చోట క్లిక్ చేయండి.
  6. 'దాటవేసే విభజనను ఇన్‌సర్ట్ చేయి' Insert jump breakఎంపికను క్లిక్ చేయండి.
పోస్ట్ టెంప్లేట్‌ని క్రియేట్ చేయండి
  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. పైభాగంలో ఎడమవైపున, కిందకు ఉన్న బాణం గుర్తును కిందకు ఉన్న బాణం గుర్తు క్లిక్ చేయండి.
  3. బ్లాగ్ పేరును క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు Settings క్లిక్ చేయండి.
  5. “పోస్ట్‌లు” విభాగంలో, పోస్ట్ టెంప్లేట్‌ని క్లిక్ చేయండి.
  6. మీ టెంప్లేట్‌ని యాడ్ చేయండి.
  7. 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

Windows, Linux

చర్య షార్ట్‌కట్
బోల్డ్, ఇటాలిక్, కింద గీత గీయడం కోసం టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయడం Ctrl + b, Ctrl + i, Ctrl + u
ఫార్మాటింగ్‌ను తీసివేయడం Ctrl + Space
లింక్ డైలాగ్‌ను తెరవడం Ctrl + k
చర్య రద్దు చేయడం Ctrl + z, Ctrl + Shift + z
మళ్లీ చేయడం Ctrl + y

Mac

చర్య షార్ట్‌కట్
బోల్డ్, ఇటాలిక్, కింద గీత గీయడం కోసం టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయడం + b, ⌘ + i, ⌘ + u
లింక్ డైలాగ్‌ను తెరవడం + k
చర్య రద్దు చేయడం + z, ⌘ + Shift + z
మళ్లీ చేయడం + y

నివారించాల్సిన కంటెంట్

వీటిని ఉపయోగించవద్దు:

  • మరొక వ్యక్తి హోస్ట్ చేసిన మెటీరియల్‌ని వారి సమ్మతి లేకుండా వినియోగించడం.
  • కాపీరైట్ చేసిన మెటీరియళ్లు.
  • మా కంటెంట్ పాలసీని ఉల్లంఘించే కంటెంట్. అంటే, సబ్జెక్ట్ సమ్మతి లేకుండా పోస్ట్ చేసే అందరికీ తగని ఇమేజ్‌లు, ద్వేషపూరిత, హింసాత్మక లేదా మోటుగా ఉండే అసభ్యకర కంటెంట్ కూడా ఉపయోగించకూడదు.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13469182662620186394
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false