అనుకూల డొమైన్‌ని సెటప్ చేయండి

ముఖ్య విషయం: మీరు మీ అనుకూల డొమైన్‌లో CAA రికార్డ్‌లను ఉపయోగిస్తే letsencrypt.org కోసం రికార్డ్‌ని యాడ్ చేయండి, లేదంటే Blogger మీ SSL సర్టిఫికెట్‌ని క్రియేట్ చేయదు లేదా రెన్యూవల్ చేయదు. 

మీరు డొమైన్‌ని కొనుగోలు చేసినప్పుడు మీ బ్లాగ్ వెబ్‌సైట్ అడ్రస్‌ని వ్యక్తిగతీకరించవచ్చు.

మీ బ్లాగ్‌తో మీ డొమైన్‌ను సెటప్ చేయండి

మీరు డొమైన్ ప్రొవైడర్ నుండి డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, Bloggerలో మీ డొమైన్‌ను సెటప్ చేసుకోవడంతో పాటు, దాని సెట్టింగ్‌లను కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు.

 Important: It may take up to 24 hours for your “blogspot.com” address to redirect you to your custom domain.

Bloggerలో మీ డొమైన్‌ను సెటప్ చేయండి

  1. Blogger‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, ఒక బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  4. "పబ్లిషింగ్" కింద, అనుకూల డొమైన్‌ను క్లిక్ చేయండి.
    1. మీరు కొనుగోలు చేసిన డొమైన్‌కు సంబంధించిన URLను ఎంటర్ చేయండి.
    2. సేవ్ చేయండిని క్లిక్ చేయండి.
  5. మీకు 2 CNAMEsతో ఒక ఎర్రర్ వస్తుంది:
    • బ్లాగ్ CNAME: పేరు విషయంలో, పేరును సబ్-డొమైన్‌గా ఎంటర్ చేయండి, ఉదాహరణకు "బ్లాగ్." లేదా "www." గమ్యస్థానం విషయంలో, “ghs.google.com” ఎంటర్ చేయండి.
    • సెక్యూరిటీ CNAME: "పేరు: XXX, గమ్యస్థానం: XXX." ఇది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది, మీ బ్లాగ్‌కు, మీ Google ఖాతాకు ఇది ప్రత్యేకంగా ఉంటుంది.

మీ డొమైన్ ప్రొవైడర్ సెట్టింగ్‌లను సెటప్ చేయండి

  1. మీ డొమైన్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  2. కంట్రోల్ ప్యానెల్‌లో డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS)ను కనుగొనండి.
    1. "పేరు, లేబుల్ లేదా హోస్ట్" కింద, 5వ దశలో భాగంగా మీరు ఎంటర్ చేసిన సబ్-డొమైన్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి.
    2. "గమ్యస్థానం, టార్గెట్ లేదా 'దీనికి పాయింట్ చేస్తుంది'" కింద, "ghs.google.com" ఎంటర్ చేయండి.
  3. రెండవ CNAMEకు వివరాలను ఎంటర్ చేయండి, ఇవి మీ బ్లాగ్‌కు, Google ఖాతాకు ప్రత్యేకమైనవి.
  4. మీ DNS సెట్టింగ్‌లను యాక్టివేట్ చేసుకోవడానికి, కనీసం ఒక గంట అయినా వేచి ఉండండి.
  5. Bloggerలో మీ డొమైన్‌ను సెటప్ చేయండి దశను రిపీట్ చేయండి.

సబ్-డొమైన్ లేని URLను, మీ బ్లాగ్‌కు చెందిన URLకు మళ్లించండి

మీ పాఠకులను “mydomain.com” నుండి “www.mydomain.com”కు మళ్లించడానికి, కింది విధంగా ప్రత్యక్ష దారి మళ్లింపును సెటప్ చేయండి:

  1. మీ డొమైన్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  2. మీ DNS సెట్టింగ్‌లను తెరవండి.
  3. Google IPలను సూచించే ఈ 4 A recordలను జోడించండి. "mydomain.com" సంబంధించి A recordలు ఇప్పటికే ఉన్నట్లయితే, మీరు ఆ A recordలను తీసివేయాలి.
    • 216.239.32.21
    • 216.239.34.21
    • 216.239.36.21
    • 216.239.38.21
  4. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  5. ఎగువ ఎడమ వైపున, ఒక బ్లాగ్‌ను ఎంచుకోండి.
  6. ఎడమ వైపున ఉన్న మెనూ నుండి, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. "పబ్లిషింగ్" అనే దాని కింద ఉన్న, డొమైన్ మళ్లింపు (mydomain.com నుండి www.mydomain.comకు) అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.

సమస్యలను పరిష్కరించండి

మీకు సమస్యలు ఉంటే, మీరు ఇక్కడ ఉన్న కొన్ని దశలు ట్రై చేయవచ్చు.

  • మీరు మీ డొమైన్‌ని సెటప్ చేస్తున్నప్పుడు రెండు CNAMEలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు.
  • "పేరు, లేబుల్ లేదా హోస్ట్" CNAME సరైనదే అని నిర్ధారించుకోండి.
  • మీ అనుకూల డొమైన్ పని చేయకుంటే, ఈ దశలు మళ్లీ ట్రై చేసే ముందు వేచి ఉండండి. మీకు సమస్యలు ఉంటే, మీ డొమైన్ ప్రొవైడర్‌ని సంప్రదించండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11290973027773398818
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false